News December 19, 2024
మార్కాపురం: భార్యపై భర్త గొడ్డలితో దాడి

అనుమానంతో భార్యపై గొడ్డలితో దాడి చేసిన ఘటన మార్కాపురంలోని ఏకలవ్య కాలనీలో జరిగింది. దోర్నాల మండలం చిన్నగుడిపాడులో VROగా పనిచేస్తున్న చిన్న కొండయ్య, మరియమ్మ దంపతులకు కొన్నేళ్లుగా మనస్పర్ధలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెపై అనుమానం పెంచుకున్న చిన్న కొండయ్య తెల్లవారుజామున గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన మరియమ్మను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
Similar News
News December 4, 2025
పోక్సో కేసులను త్వరితగతిన విచారించండి: SP

పోక్సో కేసులను త్వరితగతిన విచారించి పూర్తి చేయాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన గురువారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి లోపం కనిపించకూడదన్నారు. గంజాయి వంటి మత్తుపదార్థాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
News December 4, 2025
ప్రకాశంలో జోరు తగ్గిన మద్యం.. లెక్కలివే!

ప్రకాశంలో నవంబర్కు సంబంధించి మద్యం కొనుగోళ్ల జోరు తగ్గింది. అధికారుల వద్ద ఉన్న లెక్కల మేరకు (కోట్లల్లో).. ఈ ఏడాది జనవరిలో రూ. 105.69, ఫిబ్రవరి రూ. 106.28, మార్చి రూ. 117.41, ఏప్రిల్ రూ.66.5, మే రూ.117.41, జూన్ రూ.110.26, జులై రూ.105.37, ఆగస్ట్ రూ.118.62, సెప్టెంబర్ రూ.111.52, అక్టోబర్ రూ.95.38, నవంబర్ రూ. 86.75 కోట్లల్లో ఆదాయం దక్కింది. డిసెంబర్లో ఆదాయం అధికంగా రావచ్చని అధికారుల అంచనా.
News December 3, 2025
మద్దిపాడులో వసతి గృహాలను తనిఖీ చేసిన ప్రకాశం కలెక్టర్

మద్దిపాడులోని SC, ST, BC సంక్షేమ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వద్ద విద్యార్థులకు కల్పించిన సౌకర్యాల గురించి కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థుల హాజరు శాతం, పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంలో అశ్రద్ధవహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


