News November 6, 2024
మార్కాపురం యువకుడి ఫిర్యాదుతో అరెస్ట్

ప్రకాశం జిల్లా యువకుడి ఫిర్యాదుతో పల్నాడు జిల్లా వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ వరద సాయం మాటున అవినీతి చేశారంటూ సత్తెనపల్లికి చెందిన కల్లి నాగిరెడ్డి అలియాస్ నాని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై X వేదికగా ఆరోపణలు చేశాడు. ఇదే విషయమై మార్కాపురం పట్టణానికి చెందిన యశ్వంత్(19) PSలో ఫిర్యాదు చేశాడు. తాడేపల్లిలో ఉన్న నాగిరెడ్డిని మార్కాపురం పట్టణ ఎస్ఐ సైదుబాబు అరెస్టు చేశారు.
Similar News
News February 24, 2026
రేపు మార్కాపురం జిల్లాకు CM.. షెడ్యూల్ ఇదే.!

CM చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పర్యటన షెడ్యూల్ CMO అధికారులు విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12:50కి దోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను పరిశీలించి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30కి మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4:40కి తిరిగి వెలగపూడికి బయలుదేరుతారు.
News February 24, 2026
ఒంగోలు: ‘మీకోసం’కు 75 ఫిర్యాదులు

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా సోమవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు ప్రత్యక్షంగా వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. మీకోసం కార్యక్రమానికి 75 ఫిర్యాదులు అందాయని త్వరగా పరిష్కరించాలన్నారు.