News April 5, 2025
మార్కాపురం: రైల్వే పట్టాలపై మృతదేహం కలకలం

మార్కాపురం రైల్వే స్టేషన్ ఔటర్ వద్ద పట్టాల పక్కన శనివారం మధ్యాహ్నం వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా రైల్లో నుంచి జారిపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News April 8, 2025
రూ.143 కోట్లతో మరమ్మతులు: మంత్రి స్వామి

మంత్రి స్వామి డెహ్రాడూన్‌లో జరుగుతున్న చింతన్ శివిర్ రెండవ రోజు సమావేశంలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో అమలు చేయనున్న పీ-4పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. రూ.143 కోట్లతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు.
News April 8, 2025
పేదల గృహాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

ప్రకాశం జిల్లాలో పేదల గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సోమవారం ఆమె మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 31వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 8,839 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు.
News April 8, 2025
కందుకూరులో కనిగిరి యువకుడి ఆత్మహత్య

కందుకూరు పట్టణంలో కనిగిరి యువకుడు ఉరేసుకున్నాడు. కల్లూరి శివ నాగరాజు(26) కందుకూరు పోస్టాఫీస్ సెంటర్‌కు సమీపంలోని వెంకటరమణ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కనిగిరిలో క్రికెట్ బెట్టింగ్ వేసి అప్పులపాలై కందుకూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.