News May 24, 2024
మార్కాపురం: విద్యుత్ షాక్తో ఏడు పాడి గేదెలు మృతి

విద్యుదాఘాతంతో 7 పాడి గేదెలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు గ్రామానికి చెందిన పలువురి రైతులకు చెందిన 7 పాడి గేదెలు శుక్రవారం గ్రామ శివారులో మేత మేస్తున్నాయి. ఈ క్రమంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తాకి అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ గేదెల విలువ రూ.5లక్షలు ఉంటుందని రైతులు వాపోయారు.
Similar News
News November 19, 2025
జేసీకి ఫిర్యాదు.. చక్కదిద్దే ప్రయత్నాల్లో అధికారులు!

ప్రకాశం జేసీకి ఫిర్యాదు చేస్తే చాలు, అలా పరిష్కారం కావాల్సిందే అంటున్నారు దివ్యాంగులు. సోమవారం నిర్వహించిన కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి దివ్యాంగులు తమ సమస్యను మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం అందించే త్రీ వీలర్ బైక్ పొందేందుకు, ఎల్ఎల్ఆర్ లైసెన్స్ అవసరం. దీనికై రవాణా శాఖ కార్యాలయం వద్ద కొందరు లాబీయింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు జేసీ వద్ద వాపోయారు. ఆయన ఆదేశాలతో లాబీయింగ్కు చెక్ పడిందట.
News November 19, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు కొత్తఏరువారిపల్లి విద్యార్థిని ఎంపిక

సింగరాయకొండ మండలం పాకాలలో జరిగిన అండర్- 14 ఖోఖో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో కనిగిరి మండలం కొత్త ఏరువారిపల్లి హైస్కూల్ విద్యార్థిని హర్షవర్ధని సత్తా చాటి ప్రకాశం జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు PET అహ్మద్ చెప్పారు. హర్షవర్ధనికి ఉపాధ్యాయులు, సర్పంచ్ వెంకటయ్య, గ్రామస్థులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉన్నత ప్రతిభ కనబరచాలని వారు కోరారు.
News November 19, 2025
పెద్దారవీడు వద్ద ఎద్దుల అరకలను ఢీకొని దోర్నాల వ్యక్తి మృతి

పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న ఎద్దుల అరకలను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు దోర్నాల మండలం యడవల్లికి చెందిన నల్లబోతుల శివగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


