News September 22, 2024

మార్కాపురం: 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి.. ఆచూకీ లభ్యం

image

మార్కాపురంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనబడిన వ్యక్తిని మార్కాపురం ఎస్సై సైదుబాబు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారణ చేయగా.. సదరు వ్యక్తిది సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామానికి చెందిన శేషమ్మ కుమారుడు శ్రీహరిగా తెల్సింది. 20 సంవత్సరాల కిందట తప్పిపోయిన అతను తన కుమారుడేనని తల్లి తెలిపింది. ఇన్నేళ్ల తర్వాత తమ కుమారుడి ఆచూకీ లభించడంపై ఆమె ఆనందం వ్యక్తం చేసి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 24, 2025

రాచర్ల: పొలంలో నీళ్లు పెడుతుండగా.. కరెంట్ షాక్‌కి గురై..

image

రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన చిట్టిబాబు చిన్న కుమారుడు రాజేశ్ విద్యుత్ షాక్‌కు గురై ఆదివారం మృతి చెందారు. మొక్కజొన్న పొలంలో నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

News November 24, 2025

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

image

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.