News July 27, 2024

మార్కాపురం: PIC OF THE DAY

image

మార్కాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల దినోత్సవాన్ని ముందస్తుగా నిర్వహించారు. దీనికి జోన్ ZEO శ్రీకృష్ణ గణేష్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ నాగరాజు నిర్వహించారు. తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం తల్లిదండ్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలు తల్లిదండ్రుల విలువ తెలుసుకోవాలని గణేశ్ తెలిపారు. పిల్లలకు ల్లిదండ్రులతో ఆశీర్వాదం ఇప్పించారు.

Similar News

News November 16, 2025

ప్రకాశం జిల్లాకు 2 రోజుల పాటు మోస్తరు వర్షసూచన

image

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది.

News November 15, 2025

ప్రకాశం జిల్లాకు 2 రోజులు పాటు మోస్తరు వర్షసూచన

image

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం అధికంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది.

News November 15, 2025

ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

image

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.