News April 14, 2025

మార్కుల ఆనందం ఆవిరైంది!

image

కదిరిలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న శారద (40) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆమె కుమార్తె కీర్తి విజయవాడలో ఇంటర్ చదువుతుండగా 973 మార్కులు వచ్చాయి. దీంతో విజయవాడ నుంచి కుమార్తెను తీసుకుని అరుణాచలం వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి కారులో వస్తుండగా పుంగనూరు మండలం సుగాలిమిట్టలో లారీ ఢీకొని చనిపోయారు. ఈ ఘటనలో భర్త, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని బెంగళూరుకు తరలించారు.

Similar News

News November 24, 2025

MNCL: పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

image

2025- 26 సంవత్సరానికి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ (టీసీసీ) పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ రూ.100, హయ్యర్‌ రూ.150, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ రూ.150, హయ్యర్ రూ.200 పరీక్ష ఫీజు చెల్లించాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు. అపరాధ రుసుం లేకుండా డిసెంబర్ 5 వరకు, అపరాధ రుసుం రూ.50తో 12వ తేదీ, రూ.75తో 19వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని సూచించారు.

News November 24, 2025

నెల్లూరు విద్యార్థులకు ఎవరెస్ట్ ఎక్కే ఛాన్స్.!

image

జిల్లాలోని 52 మంది దివ్యాంగ విద్యార్థులకు అపురూప సాహస యాత్ర అవకాశం దక్కింది. సమగ్రశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అడ్వెంచర్ స్పోర్ట్స్’కార్యక్రమానికి విద్యార్థులు ఎంపికయ్యారు. PMశ్రీ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపితే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపికవుతారు. ముందుగా వారు జోనల్ స్థాయి, రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలి. అందుకోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News November 24, 2025

శ్రీకాకుళం జిల్లాస్థాయి సంఘ సమావేశాల నిర్వహణ

image

శ్రీకాకుళం జిల్లా స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం నుంచి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న ఈ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ స్థాయి సంఘాల ప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. సమావేశాలకు అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో పాల్గొనాలని ఆదేశించారు.