News February 12, 2025
మార్కెట్లోకి BE6, XEV9 కార్లు

అనంతపురం MGB మొబైల్స్ మహీంద్రా బ్రాంచ్ ప్రతినిధులు BEV BE6, XEV9E మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేశారు. మహీంద్రా AI ఆర్కిటెక్చర్, 110 cm వైడ్ సినిమా స్కోప్ లగ్జరీ డిస్‌ప్లేతో పాటు Z క్లాస్ సెక్యూరిటీతో 5 కెమెరాలను కలిగి ఉంది. ఆటో పార్కింగ్ సదుపాయం కూడా ఉండగా దీని ధర రూ.18.9 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని అన్నారు. ఏపీలో దీనిపై లైఫ్ టాక్స్ లేదు.
Similar News
News March 21, 2025
బనగానపల్లెలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు.. ఆస్పత్రి సీజ్

బనగానపల్లెలో ఆయుష్ వైద్య అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా బనగానపల్లెలో అనధికారికంగా, వైద్య అర్హతలు లేని నకిలీ వైద్యుడు సూర్య నాయుడును గుర్తించారు. పక్షవాతానికి వైద్యం చేస్తానంటూ ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తున్నాడనే ఫిర్యాదులు అందడంతో ఆయుష్ శాఖ అధికారులు డా.రవికుమార్, వాణి తనిఖీకి వెళ్లగా నకిలీ వైద్యుడు పరారయ్యాడు. ఆయుష్ అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు.
News March 21, 2025
పాస్టర్ల వేతనాలకు రూ.12.82 కోట్లు విడుదల

రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు వేతనాల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.12.82 కోట్లు విడుదల చేసిందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. ఈ మేరకు అమరావతిలో ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 8427 మంది పాస్టర్లకు నెలకు ఒక్కొక్కరికి రూ.5000 ప్రకారం వేతనం ఇస్తామన్నారు. గతేడాది మే నెల నుంచి పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు.
News March 21, 2025
కర్నూలు జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

రాష్ర్ట ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమైన అన్ని శాఖల జిల్లా అధికారులతో అభివృద్ధి కార్యక్రమాల అమలు, పురోగతిపై కలెక్టర్ చర్చించారు.