News April 15, 2025
మార్గం మధ్యలో కార్మికుడి మృతి: ఎస్ఐ

దేవీపట్నం మండలం పోలవరం ప్రాజెక్టులో పని చేస్తున్న ఒడిశాకి చెందిన ఎలక్ట్రీషియన్ పరమ నాయక్ (25)సోమవారం జరిగిన ప్రమాదంలో మృతి చెందారని ఎస్ఐ షరీఫ్ తెలిపారు. మిషన్ వద్ద అతడు పని చేస్తుండగా కటింగ్ బేడ్ విరిగి మెడలో గుచ్చుకుని తీవ్రంగా రక్తస్రావం అయింది. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడని పేర్కొన్నారు. మృతుడు ఒక ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్టు కార్మికుడుగా పని చేస్తున్నాడని తెలిపారు.
Similar News
News December 3, 2025
స్కూళ్లలోకి అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు

AP: టీచర్ల కొరతను అధిగమించేందుకు స్కూళ్లలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నారు. గతంలో పని చేసిన విద్యా వాలంటీర్ల మాదిరే వీరు విధులు నిర్వర్తిస్తారు. ఇటీవల మెగా డీఎస్సీలో పోస్టులు భర్తీ చేసినా పలు స్కూళ్లలో ఇంకా ఖాళీలున్నాయి. మొత్తం 1,146 పోస్టుల్లో ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ఉత్తర్వులు విడుదలయ్యాయి. విధుల్లో చేరిన తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10వేలు ఇస్తారు.
News December 3, 2025
అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామక ప్రక్రియ ఇలా..

AP: మండలస్థాయిలో ఉన్న ఖాళీలపై MEO ప్రకటన చేయనుండగా, ఇవాళ్టి నుంచి 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లను MEO ఆఫీసుల్లో సమర్పించాలి. అకడమిక్(75%), ప్రొఫెషనల్(25%) అర్హతల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారవుతుంది. స్థానిక గ్రామాలు, మండలాల వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెల 7వ తేదీలోగా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఫైనల్ అర్హుల జాబితాను ఖరారు చేస్తుంది. తర్వాతి రోజు నుంచే విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది.
News December 3, 2025
వరంగల్: ట్విస్ట్.. ఆశాలపల్లిలో ఏకగ్రీవం లేనట్లే..!

జిల్లాలోని సంగెం(M) ఆశాలవల్లిలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం దిశ నుంచి పోటీ మూడ్కు మారింది. SC మహిళ మల్లమ్మ సర్పంచ్ అవుతారనే ఊహాగానాలకు చెక్ పడింది. గ్రామ యువకుడు కార్తీక్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నక్కలపల్లి యువతి నవ్యశ్రీకి BRS-BJPలు బ్యాకింగ్ ఇవ్వడంతో బరిలోకి దిగింది. ప్రేమలో గెలిచిన నవ్యశ్రీ సర్పంచ్గానూ గెలుస్తుందా? లేక అధికార పార్టీ వర్గాల మద్దతున్న మల్లమ్మ విజయం సాధిస్తారా? తెలియాల్సి ఉంది.


