News March 3, 2025

మార్చిలోనే సుర్రుమనిపిస్తున్న సూర్యుడు

image

మార్చి మొదటి వారంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. వరసగా మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఎండల ప్రభావం ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా ఉండనుంది. సింగరేణి ప్రాంతం కనుక మిగతా జిల్లాలో కంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News February 26, 2026

ప.గో: ఖాళీలు భర్తీ చేయకుంటే ఎలా (2/2)

image

ఉమ్మడి జిల్లా పరిషత్‌ పరిధిలో <<19245662>>ఉద్యోగుల కొరత<<>> పాలనను కుంగదీస్తోంది. 662 పోస్టులు ఖాళీగా ఉండటంతో కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోంది. వీటిలో కీలకమైన అకౌంట్స్ అధికారి, 13 ఎంపీడీవో, పరిపాలనాధికారి, సీనియర్ అసిస్టెంట్లు, స్టెనోలు, 20 లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు అత్యధికంగా 419 ఆఫీస్ సబార్డినేట్, 177 క్లాస్-4 ఉద్యోగాలు భర్తీకి నోచుకోకపోవడంతో జిల్లా స్థాయిలో పరిపాలన కష్టసాధ్యంగా మారింది.

News February 26, 2026

పశ్చిమగోదావరి జడ్పీలో సిబ్బంది కొరత (1/2)

image

పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌, జడ్పీ ఉన్నత పాఠశాలలు, ఎంపీడీవో కార్యాలయాలను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సిబ్బంది లేమి వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని జడ్పీ ఛైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ ప్రసాద్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి.. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి సిబ్బంది కొరత లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News February 26, 2026

రోజూ లిప్‌స్టిక్ వాడుతున్నారా?

image

పెదాలు అందంగా కనిపించడానికి చాలామంది మహిళలు లిప్‌స్టిక్ వాడుతుంటారు. అయితే వీటిలో ఉండే రసాయనాల వల్ల అనారోగ్యాల ముప్పుందంటున్నారు నిపుణులు. చాలా లిప్‌స్టిక్‌ల తయారీలో కాడ్మియం, సీసం, క్రోమియం, అల్యూమినియం రసాయనాలు వాడతారు. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థలు దెబ్బతినడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తాయని హెచ్చరిస్తున్నారు. లెడ్ ఫ్రీ, నాన్ టాక్సిక్ ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.