News March 3, 2025
మార్చిలోనే సూర్రు మనిపిస్తున్న సూర్యుడు

మార్చి మొదటి వారంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. వరసగా మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఎండల ప్రభావం ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా ఉండనుంది. సింగరేణి ప్రాంతం కనుక మిగతా జిల్లాలో కంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News March 4, 2025
పులిగుండాల ప్రాంతంలో రూఫస్ బెల్లిడ్ ఈగల్ ప్రత్యక్షం

పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు ప్రాంతంలో అరుదైన ఆసియా డేగ కెమెరాల్లో చిక్కింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఆసియా ప్రాంతానికి చెందిన వేటాడే పక్షి రూఫస్ బెల్లిడ్ ఈగల్‌గా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ విలక్షణమైన పక్షి తల, మెడ, రెక్కలు, వీపు, తోక స్లాటీ నల్లగా ఉంది. దాదాపు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ఈ పక్షి ఇక్కడ కనిపించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News March 4, 2025
ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు

యాసంగి పంటలను సంరక్షించేలా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి యాసంగి పంటలకు సాగునీటి సరఫరా, గురుకులాల్లో రెగ్యులర్‌గా తనిఖీలు, ప్లాస్టిక్ ఫ్రీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.
News March 4, 2025
ఖమ్మం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం నగరంలోని మహిళా ప్రాంగణంలో వివిధ కోర్సులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మహిళా ప్రాంగణం అధికారి వేల్పుల విజేత తెలియజేశారు. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఈనెల పదో తేదీలోగా ఖమ్మంలోని మహిళా ప్రాంగణంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. మరిన్ని వివరాలకు టేకులపల్లిలో ఉన్న మహిళా ప్రాంగణం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.