News February 27, 2025

మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలు

image

మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలు: ☛ 9న కులశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం ☛ 10న మతత్రయ ఏకాదశి ☛13న ఏకాదశి-తెప్పోత్సవాల సమాప్తి☛14న కుమారధారతీర్థ ముక్కోటి☛25న సర్వ ఏకాదశి☛26న అన్నమాచార్య వర్థంతి☛28న ఏకాదశి☛ 29న సర్వ అమావాస్య☛30న శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది.. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.

Similar News

News December 3, 2025

పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం: ఖమ్మం సీపీ

image

దట్టమైన పొగమంచు సమయాల్లో వాహన ప్రయాణం ప్రమాదకరమని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారని, పొగమంచు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని స్వల్ప నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News December 3, 2025

సంగారెడ్డి: రేపు హాకీ ఉమ్మడి జిల్లా పోటీలు

image

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హాకీ బాలబాలికల అండర్-14, 17 ఉమ్మడి మెదక్ జిల్లా పోటీలు సంగారెడ్డిలోని అంబేద్కర్ మేధావులు నిర్వహిస్తున్నట్లు సెక్రటరీ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఆధార్ కార్డు, బోనాఫైడ్‌తో ఉదయం 9 గంటలకి హాజరుకావాలని చెప్పారు.

News December 3, 2025

పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులు

image

కూసుమంచి మండలం పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులకు చేరింది. ఈ సందర్బంగా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 20.5 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి జలాశయానికి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం నుంచి కింది కాల్వకు, తాగునీటికి నీటిని వినియోగిస్తున్నారు.