News February 25, 2025

మార్చి 1న HYD, రంగారెడ్డిలో రేషన్ కార్డుల పంపిణీ

image

కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మొదటిగా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్, HYD ప్రజలకు మార్చి1న అందించనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. రంగారెడ్డిలో 24వేల కొత్త రేషన్ కార్డులు, వికారాబాద్‌లో 22 వేలు, మేడ్చల్‌లో 6వేలు, HYD 285 రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దీనికి చివరి గడువంటూ ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు.

Similar News

News November 1, 2025

PDPL: ‘భూభారతి దరఖాస్తులు వెంటనే డిస్పోజ్ అవ్వాలి’

image

భూభారతి పోర్టల్‌లో వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కాల్వశ్రీరాంపూర్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీసేవ ద్వారా పౌరసేవల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో డిస్పోజ్ చేయాలన్నారు. కార్యాలయంలోని పలు రికార్డులను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వనజ, తహశీల్దార్ జగదీశ్వర రావు, తదితరులు ఉన్నారు.

News November 1, 2025

అడ్రియాల ప్రాజెక్ట్‌లో 0.14L టన్నుల బొగ్గు ఉత్పత్తి

image

అక్టోబర్ నెల బొగ్గు ఉత్పత్తి వివరాలను శనివారం RG- 3 పరిధిలోని అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జీఎం కొలిపాక నాగేశ్వరరావు వెల్లడించారు. లాంగ్‌వాల్ ప్రాజెక్ట్‌కు నిర్దేశించిన 1.63 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 0.14 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను భద్రతతో సాధించేందుకు ఉద్యోగులు కట్టుబడి పనిచేయాలని జీఎం సూచించారు.

News November 1, 2025

ఏపీలో ఎక్కువ సాగవుతున్న ఆయిల్ పామ్ రకాలు

image

☛ కోస్టారికా: ఏపీలో ఎక్కువగా సాగవుతున్న ఆయిల్ పామ్ రకం ఇది. ఈ చెట్లు చాలా పొడవుగా పెరుగుతాయి. గెలల పరిమాణం పెద్దగా వస్తాయి. ఎక్కువ బరువు ఉంటాయి. ☛ సిరాడ్ షార్ట్: ఈ రకం మొక్క మట్టలు తక్కువ సైజులో వస్తాయి. ఈ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగవు. గెలల సంఖ్య ఎక్కువ. గెలల బరువు తక్కువ బరువు ఉన్నా.. ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల రైతులు ఈ రకం సాగుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.