News February 25, 2025
మార్చి 1న HYD, రంగారెడ్డిలో రేషన్ కార్డుల పంపిణీ

కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మొదటిగా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్, HYD ప్రజలకు మార్చి1న అందించనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. రంగారెడ్డిలో 24వేల కొత్త రేషన్ కార్డులు, వికారాబాద్‌లో 22 వేలు, మేడ్చల్‌లో 6వేలు, HYD 285 రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దీనికి చివరి గడువంటూ ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు.
Similar News
News March 27, 2025
మేయర్ కలిసిన ఇండియానాలో పోలో బృందం

అమెరికాకు చెందిన ఇండియానాలో పోలో బృందం మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో భేటీ అయ్యింది. 2010లో ఇండియనా స్టేట్ పలు అంశాలపై సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో మేయర్ ఆ బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ధన్యవాదాలు తెలిపారు. సిస్టర్ సిటీ ఒప్పందంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇండియనా ప్రతినిధులు మేయర్‌కు వివరించారు.
News March 27, 2025
HYDలో నేడు డబుల్ ధమాకా

HYDలో IPL సంబరాలు నేడు అంబరాన్ని అంటనున్నాయి. వినోదానికి ఉర్రూతలూగించే సంగీతం జతకానుంది. నేడు ఉప్పల్ వేదికగా రాత్రి 7:30కు SRH VS LSG మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భాగంగా స్టేడియంలో తమన్ మ్యూజికల్ నైట్ ఈవెంట్ ఉంది. ఇంకేముంది క్రికెట్ ప్రియులు డబుల్ ధమాకా అంటున్నారు. హైదరాబాద్ ఫ్యాన్స్ తగ్గేదే లే అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
News March 26, 2025
ఎల్బీనగర్‌లో మర్డర్.. నిందితుల అరెస్ట్

LBనగర్ శివగంగకాలనీలో మార్చి 23న పాతకక్షలతో మహేశ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పురుషోత్తం, నాగార్జున, సందీప్, రాము, రాజరాకేశ్, కుంచల ఓంకార్ నిందితులుగా ఉన్నారు. వీరి నుంచి ఫోన్‌లు, బైకు, కారు, గొడ్డలి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు CI వినోద్ కుమార్ తెలిపారు.