News December 23, 2024
మార్చి 1 నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు ప్రారంభించినట్లు ఆలయ ఈవో భాస్కర రావు తెలిపారు. మార్చి 1 నుంచి 11 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మార్చి 7న శ్రీవారి ఎదుర్కోలు, 8న స్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం, 9నశదివ్యవిమాన రథోత్సవం, 10న పూర్ణాహుతి, చక్రతీర్థం,11న శతఘటాభిషేకం, డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Similar News
News December 19, 2025
నల్గొండ: జనవరి నుంచి HPV టీకాలు

మహిళల్లో వచ్చే క్యాన్సర్లను అరికట్టాలనే లక్ష్యంతో 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలందరికీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ (HPV)ను వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. HPV టీకాలపై డీఎంహెచ్ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్లు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ టీకాలను 2026 జనవరి నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇస్తామన్నారు.
News December 19, 2025
NLG: 306 స్థానాల్లో గెలిచిన బీసీలు!

జిల్లాలో మొత్తం 869 గ్రామపంచాయతీలు ఉండగా.. వీటిలో మూడు పంచాయతీలు మినహా మిగతా 866జిపిలకు ఎన్నికలు నిర్వహించారు. బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లతో పాటు, జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసి 306 స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. దీంతో జిల్లాలో 35.33 శాతం స్థానాలు బీసీలకే దక్కాయి.
News December 19, 2025
ముగిసిన ప్రత్యేక పాలన.. పల్లెలకు కొత్త సారధులు

నల్గొండ జిల్లాలో 22 నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడింది. ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఈనెల 22న నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలోని మొత్తం 869 గ్రామ పంచాయతీలకు గాను, మూడు మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతుండటంతో పల్లెల్లో సందడి నెలకొంది.


