News February 28, 2025
మార్చి 2న ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి యోగా పోటీలు

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి యోగా పోటీలు మార్చి 2న సూర్యాపేటలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు యోగా గురువు చాడ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో యోగ పోటీల గురించి సాధకులతో కలిసి మాట్లాడారు. మొట్టమొదటిసారిగా సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా స్థాయి యోగ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
బాధితులకు రూ.1.85 కోట్లు అందజేత: కలెక్టర్

జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం జరిగిన విజిలెన్స్ కమిటీ సమావేశంలో డిసెంబర్ 24 నుంచి మే 25 వరకు బాధితులకు రూ.1.85 కోట్ల పరిహారం చెల్లించామని తెలిపారు. అట్రాసిటీ కేసులలో ఎఫ్ఐఆర్, చార్జిషీట్ నమోదులో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News November 28, 2025
ఖమ్మం జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం!

ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంది. తాజా ఓటర్ల వివరాల ప్రకారం నేలకొండపల్లిలో అత్యధికంగా 2,150 మంది మహిళా ఓటర్లు అదనంగా ఉన్నారు. రఘునాథపాలెం 1,946, కూసుమంచి 1,645, చింతకాని 1,733, ఖమ్మం రూరల్, సత్తుపల్లి, ఏరుపాలెం, తల్లాడ, బోనకల్, పెనుబల్లి, కొణిజర్ల, సింగరేణి వంటి మొత్తం 12 మండలాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే 1,000కి పైగా అధికంగా ఉన్నారు.
News November 28, 2025
ఖమ్మం: తీగల వంతెన పనులకు జూన్ వరకు గడువు

ఖమ్మం నగరానికి కొత్త అందాలను తెచ్చేందుకు రూ.180 కోట్ల వ్యయంతో మున్నేరు నదిపై నిర్మిస్తోన్న తీగల వంతెన నిర్మాణ పనులు 60 శాతం పూర్తయ్యాయి.వర్షాలు,వరదల కారణంగా పనులకు అంతరాయం కలగడంతో, పూర్తి గడువును వచ్చే మార్చి నుంచి జూన్ వరకు పొడిగించినట్లు ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు. వంతెన పూర్తయితే శిథిలావస్థలో ఉన్న కాల్వొడ్డు వంతెన,బైపాస్పై భారీగా ఉన్న ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు.


