News September 28, 2024

మార్చి 2025 నాటికి గృహాలు మొత్తం పూర్తి చేయాలి: కలెక్టర్

image

ప్రజలకు గృహాలు కల్పించడం అనేది ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన అంశమని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. శనివారం బాపట్ల మూలపాలెం రహదారిలోని లే అవుట్‌లో గృహ నిర్మాణా లబ్ధిదారులతో మన ఇల్లు-మన గౌరవం అనే కార్యక్రమం ద్వారా ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. మార్చి 2025 నాటికి పెండింగ్‌లో ఉన్న గృహాలు మొత్తం పూర్తి చేయాలని సూచించారు. గృహాల పురోగతి కోసం ప్రత్యేకంగా సచివాలయాల సిబ్బందిని నియమిస్తామన్నారు.

Similar News

News February 28, 2026

అమరావతిలో సీజేఐ పర్యటనకు పక్కా ఏర్పాట్లు: కలెక్టర్

image

భారత ప్రధాన న్యాయమూర్తి అమరావతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో శంకుస్థాపన వేదికలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ పాటించడంలో ఎలాంటి అలసత్వం వహించొద్దని అధికారులకు ఆమె స్పష్టం చేశారు.

News February 27, 2026

రేపటితో ముగియనున్న గుంటూరు మెడికల్ కాలేజీ మెడికల్ ఎగ్జిబిషన్

image

గుంటూరులో ముప్పై ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న గుంటూరు మెడికల్ కాలేజీ మెడికల్ ఎగ్జిబిషన్ రేపటితో ముగియనుంది. ఫిబ్రవరి 4న ప్రారంభమైన ఈ ప్రదర్శనకు ఇప్పటివరకు సుమారు 80 వేల మంది హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ సందర్శించి అభినందించారు. చివరి రోజున ప్రజలు తప్పక వీక్షించాలని ప్రిన్సిపల్ డా. సుందరాచారి కోరారు. మరుపురాని వైద్య విజ్ఞాన అనుభూతిని పొందినట్లు పలువురు సందర్శకులు పేర్కొన్నారు.