News February 25, 2025
మార్చి 29తో ముగియనున్న ఎమ్మెల్సీ పదవీ కాలం

టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగిన రామారావు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2019లో ఎమ్మెల్యే కోటాలో దువ్వారపు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఈ స్థానం ఖాళీ కానుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. ఈయన స్థానంలో పార్టీ ఎవరి పేరును ఖరారు చేస్తుందో వేచి చూడాలి.
Similar News
News February 25, 2025
వైసీపీ పాలనలో ఉపాధ్యాయులకు అవమానం: గంటా

గత వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పెట్టి అవమానించిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ గెలిపించాలన్నారు. పదవిని కాపాడుకోవడానికే జగన్ అసెంబ్లీకి వచ్చారని, తాము గేట్లు తెరిస్తే వైసీపీ నుంచి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు.
News February 25, 2025
భక్తులపై ఏనుగులు దాడి.. హోంమంత్రి అనిత ఆరా

భక్తులపై ఏనుగుల దాడి చేసిన ఘటనపై హోంమంత్రి అనిత ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లాలోని వైకోట సమీపంలో ఏనుగుల దాడి ఘటనపై ఎస్పీ విద్యాసాగర్తో హోంమంత్రి మాట్లాడారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఏనుగుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుండాల కోనకు వెళ్లే భక్తులకు మరింత భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.
News February 25, 2025
విశాఖలో ఆర్డీవోకు చుక్కెదురు

విశాఖలోని ఓ దినపత్రికపై మీద ఎదురుదాడి చేసిన అధికార యంత్రాంగానికి హైకోర్టులో చుక్కెదురైంది. లీడర్ దినపత్రిక సంపాదకులు రమణ మూర్తికి ఆర్డీవో శ్రీలేఖ ఇచ్చిన నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు అలాగే ఆర్డీవో ఇచ్చిన నోటిస్పై 3 వారాలులోగా పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.