News February 27, 2026
మార్చి 3న అలంపూర్ ఆలయాలు మూసివేత

మార్చి 3న కేతు గ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం ఉన్నందున అలంపూర్‌లోని జోగులాంబ దేవి, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు, ఈవో దీప్తి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. 3న ఉదయం 7:00 ఆలయాల తలుపులు మూసివేసి దర్శనాలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. 4న ఉదయం 9:00 మహా మంగళహారతితో ఆలయాలు తెరిచి భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు. భక్తులు గ్రహించి సహకరించాలని కోరారు.
Similar News
News April 18, 2026
కొత్త SEకి కలెక్టర్ సూచన

వరంగల్ విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆనందం శుక్రవారం కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన విద్యుత్ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. జూన్ 2న భవనాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నందున పనుల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈ భేటీలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
News April 18, 2026
కామారెడ్డి: అప్పుల బాధతో మహిళ రైతు ఆత్మహత్య

కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో శుక్రవారం సాయంత్రం ఓ మహిళ రైతు తన పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన లింగవ్వగా గుర్తించారు. భర్త మరణం తర్వాత అప్పుల భారం భరించలేక పాల్పడినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.