News February 25, 2025
మార్చి 31లోపు LRS దరఖాస్తుల పరిష్కారం: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో LRS (లేఅవుట్ రెగ్యులరైజేషన్) దరఖాస్తులను మార్చి 31లోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖల సమన్వయంతో 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పెండింగ్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, బఫర్ జోన్ సమస్యలు లేని దరఖాస్తులను తక్షణమే ఆమోదించాలన్నారు.
Similar News
News November 7, 2025
ఖమ్మంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఖానాపురం హవేలీ పోలీసుల కథనం ప్రకారం.. గోపాలపురంలోని కశ్మీర్ దాబా ఎదురుగా అర్ధరాత్రి ఓ యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
News November 7, 2025
ఖమ్మం: వందేమాతరం గీతాలాపనలో ఇన్ఛార్జ్ కలెక్టర్

వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ డా.శ్రీజ, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.శ్రీజ మాట్లాడుతూ.. కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు.
News November 7, 2025
ఖమ్మం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘వందే మాతరం’

జాతీయ గీతం ‘వందేమాతరానికి’ 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఖమ్మం పోలీస్ హెడ్ క్వాటర్స్ పరేడ్ గ్రౌండ్స్, అన్ని పోలీస్ స్టేషన్లలో వందే మాతరం జాతీయ గేయాన్ని సామూహికంగా ఆలపించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అధికారులందరూ పాల్గొన్నారు. ఈ వేడుకలు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరగనున్నాయని పోలీస్ అధికారులు తెలిపారు.


