News February 25, 2025

మార్చి 31లోపు LRS దరఖాస్తుల పరిష్కారం: కలెక్టర్ 

image

ఖమ్మం జిల్లాలో LRS (లేఅవుట్ రెగ్యులరైజేషన్) దరఖాస్తులను మార్చి 31లోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖల సమన్వయంతో 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పెండింగ్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, బఫర్ జోన్ సమస్యలు లేని దరఖాస్తులను తక్షణమే ఆమోదించాలన్నారు.

Similar News

News March 22, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ పర్యటన ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} కల్లూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పది పరీక్షలు.

News March 22, 2025

రాష్ట్రస్థాయి పోటీలకు ఖమ్మం బిడ్డ సిరి

image

వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు 2025 రాష్ట్రస్థాయి పోటీలకు జేవియర్ ప్రభుత్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థిని దాసరి సిరి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ డా.ఎన్.గోపి తెలిపారు. కళాశాలతో పాటు మండల, జిల్లా స్థాయుల్లో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైందన్నారు. ప్రిన్సిపల్‌తో పాటు అధ్యాపక, అధ్యాపకేతర, విద్యార్థులు దాసరి సిరికి అభినందనలు తెలిపారు.

News March 21, 2025

ఎంపీ వద్దిరాజుకు రాష్ట్రపతి ముర్ము ఆహ్వానం

image

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు తదితర ఎంపీలతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం ఉదయం అల్పాహారం తీసుకున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులను ఆహ్వానించి అల్పాహార విందునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర రాజ్యసభలో తన సహచర ఎంపీలతో పాటు రాష్ట్రపతి ముర్మును కలిసి పలు అంశాలపై మాట్లాడారు.

error: Content is protected !!