News March 6, 2025
మార్చి 7 నుంచి ప్రయోగ తరగతులు.

మహబూబ్ నగర్ MVS కళాశాలలోని డా.బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ 3వ ఏడాది సైన్స్ విద్యార్థులకు సెమిస్టర్ 5 ప్రయోగ తరగతులు మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయన్నాయి. ఈ ప్రయోగ తరగతులకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని స్టడీ సెంటర్ల విద్యార్థులు హాజరు కావాలని, 80% హాజరు లేని వారిని ప్రయోగ పరీక్షలకు అనుమతించరని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
Similar News
News November 16, 2025
ASF జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపిక

జాతీయ యువజన ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న ఉదయం 11 గంటలకు జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపికను అసిఫాబాద్లోని ఆదివాసీ భవన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 15 నుంచి 29ఏళ్లలోపు వారు ఈ పోటీలలో పాల్గొనవచ్చన్నారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారిని రాష్ట్ర స్థాయి ఉత్సవాలకు పంపిస్తామని పేర్కొన్నారు.
News November 16, 2025
మెట్పల్లి: ‘ఓపెన్ డిగ్రీ విద్యార్థులూ రెగ్యులర్ క్లాసులకు రావచ్చు’

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్స్ పొందిన విద్యార్థులు మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్గా జరుగుతున్న డిగ్రీ తరగతులకు సైతం హాజరుకావచ్చని ప్రిన్సిపల్ డాక్టర్ కే.వెంకయ్య తెలిపారు. కాగా, కళాశాలలో ఉన్న అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ అధ్యయన కేంద్రంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఆదివారం క్లాసులు ప్రారంభించారు. కో-ఆర్డినేటర్ రాజేందర్, దశరథం, గంగాధర్ తదితరులున్నారు.
News November 16, 2025
సేవింగ్స్ అకౌంట్లో ఈ లిమిట్ దాటితే ఐటీ నిఘా ఖాయం!

బ్యాంకు ట్రాన్సాక్షన్ పరిమితులు తెలియకుండా భారీగా లావాదేవీలు చేస్తే IT నిఘా ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక FYలో సేవింగ్స్ ఖాతాలో ₹10 లక్షలు, కరెంట్ ఖాతాలో ₹50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించితే ITకి రిపోర్ట్ చేయాలి. FD ₹10 లక్షలు, ఒక వ్యక్తి నుంచి నగదు రూపంలో ₹2 లక్షల వరకు మాత్రమే పొందవచ్చు. ప్రాపర్టీ కొనుగోలు టైమ్లో ₹30 లక్షలు, క్రెడిట్ కార్డు బిల్లు ₹10 లక్షల పరిమితిని దాటకూడదు.


