News March 6, 2025
మార్చి 7 నుంచి ప్రయోగ తరగతులు.

మహబూబ్ నగర్ MVS కళాశాలలోని డా.బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ 3వ ఏడాది సైన్స్ విద్యార్థులకు సెమిస్టర్ 5 ప్రయోగ తరగతులు మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయన్నాయి. ఈ ప్రయోగ తరగతులకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని స్టడీ సెంటర్ల విద్యార్థులు హాజరు కావాలని, 80% హాజరు లేని వారిని ప్రయోగ పరీక్షలకు అనుమతించరని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
Similar News
News March 18, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 18, మంగళవారం ఫజర్: తెల్లవారుజామున 5.10 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు ఇష: రాత్రి 7.39 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 18, 2025
MNCL: బంగారం చోరీ.. ఇద్దరి అరెస్ట్: ACP

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగి ప్యాగ పోషంను కత్తితో చంపుతామని బెదిరించి మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన మొహమ్మద్ సమీర్, మొహమ్మద్ జుబీర్‌ను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రకాష్ సోమవారం తెలిపారు. సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. బంగారు గొలుసు, కత్తి, బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
News March 18, 2025
బాధితులకు భరోసా కల్పించాలి: సూర్యాపేట ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని అన్నారు.