News March 4, 2025

మార్చి 8న మహిళా దినోత్సవం వేడుకలు: కలెక్టర్

image

మ‌హిళా శ‌క్తిని, యుక్తిని చాటి చెప్పేలా మార్చి 8న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు అధికారులు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈనెల 8న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా జిల్లా స్థాయిలో నిర్వ‌హించే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల స‌న్న‌ద్ధ‌తపై చ‌ర్చించేందుకు క‌లెక్ట‌ర్ సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో స‌మావేశం నిర్వ‌హించారు. 

Similar News

News December 22, 2025

వేములవాడ వయా KNR నుంచి అరుణాచలానికి బస్సు

image

అరుణాచలానికి వేములవాడ నుంచి SL బస్సును ఏర్పాటు చేసినట్లు VMLD DM శ్రీనివాస్ తెలిపారు. DEC 24న VMLD నుంచి మధ్యాహ్నం బయలుదేరి KNR మీదుగా కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, తిరుపతి, జోగులాంబ గద్వాల్ అమ్మవారి దర్శనాల అనంతరం DEC 28న KNR మీదుగా రాత్రికి బస్ వేములవాడకు తిరిగి చేరుకుంటుందని చెప్పారు. పెద్దలకు రూ.6,100, పిల్లలకు రూ.4,850ల ఛార్జ్ అని, వివరాలకు డిపో, బస్టాండ్‌లో సంప్రదించవచ్చు.

News December 22, 2025

చింతల్ ఠాణాలో సర్పంచ్ లేకుండానే ప్రమాణం

image

వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీ పంచాయతీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ సర్పంచ్ లేకుండానే పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారాన్ని నిర్వహిస్తున్నారు. సర్పంచ్‌గా పోటీ చేసిన శేర్ల మురళి ఈనెల 4న గుండెపోటుతో మృతిచెందగా, 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో 358 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. దీంతో ప్రస్తుతానికి ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయించాలని అధికారులు నిర్ణయించారు.

News December 22, 2025

సిరిసిల్ల: కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు

image

సిరిసిల్ల జిల్లాలోని గ్రామపంచాయతీ పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 260 జీపీలు, 2,268 వార్డుల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. నిధుల సమస్యతో ప్రమాణ స్వీకార ఖర్చు విషయంలో కార్యదర్శులు తర్జనభర్జన పడుతున్నారు.