News February 4, 2025
మార్చి 8 వరకు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు: అల్లూరి కలెక్టర్

ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ MLC, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్ర MLC ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 29 నుంచి మార్చి 8 వరకు అల్లూరి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. దీంతో ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో జరుగుతున్న మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికను మార్చి 8వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News February 13, 2025
గద్వాల: కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

విద్యార్థులకు ఉత్తమ విద్య అందించడంతో పాటు,నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు అధికారులకు ఆదేశించారు. గురువారం గద్వాల మండలంలోని పుటాన్ పల్లి గ్రామంలో తెలంగాణ ట్రైబల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల(గర్ల్స్)ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో పరిస్థితులను సమీక్షించి, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
News February 13, 2025
తెలంగాణపై వివక్ష లేదు: నిర్మలా

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్న కాంగ్రెస్ MPల ఆరోపణలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ‘తెలంగాణకు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ నోడ్ మంజూరు చేశాం. 2014 నుంచి TGలో 2605K.Mల హైవేలు నిర్మించాం. ఈ ఏడాది రైల్వేలో రూ.5337 కోట్లు కేటాయించాం. 5 వందేభారత్ రైళ్లు మంజూరు చేశాం. 2 లక్షల ఇళ్లు, 31 లక్షల మరుగుదొడ్లు, 38 లక్షల నల్లా కనెక్షన్లు అందించాం’ అని చెప్పారు.
News February 13, 2025
యాదాద్రి: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. బరిలో ఎక్కువమంది పోటీ పడుతుండడంతో ఎన్నిక రసవత్తరం కానుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.