News February 4, 2025
మార్చ్ 12న PGECET- 2025 నోటిఫికేషన్

తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -2025 నోటిఫికేషన్‌ను మార్చు 12వ తేదీన విడుదల చేయనున్నట్లు పీజీ సెట్ కన్వీనర్ అరుణకుమారి తెలిపారు. దీనిలో భాగంగా నేడు కమిటీ మీటింగ్‌ను ఉన్నతాధికారులతో కలిసి ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చ్ 17 నుంచి మే 19 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని అన్నారు. జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
Similar News
News February 16, 2026
నెల్లూరు: అడవిలో తప్పిపోయిన 12 మంది భక్తులు సేఫ్

రాపూరు (M) పంగిలి గ్రామ సమీపంలోని మామిడికొనలో ఉన్న వెలసిన శ్రీ మల్లయ్యస్వామి వారి దర్శనార్థం నెల్లూరు సిటీ అయ్యప్ప గుడి పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది టెంపోలో వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో పంగిలి గ్రామానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో చీకటి కారణంగా 12 మంది దారి తప్పిపోయారు. పోలీసులు గాలించి వారిని బంధువులకు అప్పగించారు.
News February 16, 2026
2 అల్పపీడనాలు.. వర్ష సూచన!

దక్షిణ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, శ్రీలంకలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నెల 19 తర్వాత ఉపరితల ఆవర్తనం ఏర్పడి, అల్పపీడనంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. ఈ నెల 25 నుంచి 28 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
News February 16, 2026
జీడిమామిడిలో అంతర పంటలు.. లాభాలు

జీడిమామిడి తోటల్లో తొలి ఏడాది అంతర పంటల సాగుకు అనుకూలం. దీని వల్ల కలుపు ప్రభావం తగ్గుతుంది. ఈ తోటల్లో వర్షాధారంగా కర్రపెండలం, పెసలు, మినుము, పశుగ్రాసాలు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు, పైనాపిల్‌ను అంతర పంటలుగా సాగు చేయవచ్చు. దీని వల్ల భూసారంతో పాటు, జీడిమామిడిలో దిగుబడులు కూడా పెరుగుతాయి. అంతర పంటలతో అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. అయితే ఈ అంతరపంటలకు కూడా జీడిమామిడితో పాటు సక్రమంగా ఎరువులను అందించాలి.


