News November 9, 2024
మార్టూరులో రూ. 250 కోట్లతో చక్కర ఫ్యాక్టరీ ప్రారంభం
రాయికోడ్ మండలం మార్టూరు గ్రామంలో రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మించిన గోదావరి గంగా ఆగ్రో ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చక్కర ఫ్యాక్టరీని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. చక్కర కార్మాగారం ప్రారంభంతో ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎంపీ సురేశ్ షెట్కార్, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ అంజయ్య, ఏఎంసీ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, ఆర్డిఓ రాంరెడ్డి పాల్గొన్నారు.
Similar News
News December 4, 2024
సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో భూకంపం !
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలుచోట్ల భూకంపం సంభవించింది. సంగారెడ్డి, సిద్దిపేట, హుస్నాబాద్, జగదేవ్‌పూర్, జోగిపేట, గజ్వేల్, కొమ్మేపల్లి, పొట్టపల్లి ప్రాంతాల్లో భూమి కంపించిందని పలువురు సోషల్ మీడియాలో పేర్కొనా, దీనిపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఉ.7:25 నుంచి 7:30ల మధ్య భూమి కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. అయితే మీ ప్రాంతంలో వస్తే కామెంట్ చేయండి.
News December 4, 2024
నేడు ఉమ్మడి జిల్లాలో NAS పరీక్ష
సంగారెడ్డి జిల్లాలో 101 పాఠశాలలో బుధవారం NAS పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పరీక్ష నిర్వహించడానికి 101 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను నియమించామని, ప్రతి పాఠశాలకు ఒక అబ్జర్వర్ ఉంటారని పేర్కొన్నారు. పాఠశాల హెచ్ఎంలు పరీక్ష ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని కోరారు.
News December 4, 2024
సంగారెడ్డి: నేడు ఏకసభ్య కమిషన్ పర్యటన: కలెక్టర్
సంగారెడ్డిలో బుధవారం ఏక సభ్య కమిషన్ చైర్మన్ శమీమ్ అత్తర్ సభ్యులు సంగారెడ్డికి వస్తున్నారని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్సీ కుల సంఘాల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన దళిత సంఘాల నాయకులు తమ వినతి పత్రాలను సమర్పించాలని చెప్పారు.