News March 19, 2025

మార్టూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మార్టూరు జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళుతున్న ఓ కారు టైరు పగిలి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. మరో ముగ్గురుకి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 4, 2025

నాలాను పరిశీలించిన మేయర్, కమిషనర్

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ పోతన నగర్లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పర్యటించి నాలాను పరిశీలించారు. వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు వారు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మేయర్ సూచనలు చేశారు.

News November 4, 2025

ఏటికొప్పాక హస్తకళలకు కేంద్ర ప్రోత్సాహకం

image

ఏటికొప్పాక పేరు చెప్పగానే ఎంతో సుందరమైన లక్కబొమ్మల తయారీ పరిశ్రమలు గుర్తుకొస్తాయి. ఎలమంచిలి మండలం ఏటికొప్పాకకు చెందిన హస్త కళాకారులు తమ కళా నైపుణ్యతతో తయారుచేసిన లక్కబొమ్మలకు ఖండాంతర ఖ్యాతి లభించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రూ.3 కోట్ల వ్యయంతో లక్క బొమ్మల ఎగుమతులకు మార్కెటింగ్, ఇతర సదుపాయాలు కల్పించనుంది. ఈ బాధ్యతలను ఏపీ టూరిజం శాఖకు అప్పగించారు.ఇది హస్త కళాకారులకు ఒక వరమని చెప్పాలి.

News November 4, 2025

సులభంగా డబ్బు వస్తుందంటే నమ్మొద్దు: వరంగల్ పోలీసుల హెచ్చరిక

image

సులభంగా డబ్బు వస్తుందనే ప్రకటనలను, తెలియని వ్యక్తుల మాటలను నమ్మవద్దని వరంగల్ సైబర్ పోలీసులు ప్రజలకు సూచించారు. ‘ఈజీ మనీ’ ఆశ మిమ్మల్ని నాశనం చేస్తుందని వారు హెచ్చరించారు. సులభంగా డబ్బు వస్తుందనే పథకాల వెనుక ప్రమాదం ఉంటుందని, వెబ్‌సైట్లు, యాప్‌లలో మీ వివరాలు ఇవ్వొద్దని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండటమే మీకు శ్రీరామ రక్ష అని పోలీసులు స్పష్టం చేశారు.