News June 7, 2024
మార్టూరులో వ్యక్తి అనుమానాస్పద మృతి

మార్టూరులోని శ్రీవిగ్నేశ్వర కూరగాయల మార్కెట్ సమీపంలోని తండాలో నివాసం ఉంటున్న మూడావత్ బాలనాయక్ (60) అనుమానాస్పదంగా గురువారం మృతి చెందాడు. బాలనాయక్ వ్యవసాయ పనులు చేసుకుంటూ వైసీపీ సానుభూతి పరుడిగా ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేయడం వల్లే కక్ష్యతో బాలనాయక్ను హత్య చేసి వేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. సీఐ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 23, 2025
కనిగిరిపై కనికరించండి.. మహాప్రభో.!

కనిగిరిని కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లాలో కలపవద్దని ప్రజలు అంటున్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తున్న కనిగిరిని మళ్లీ కొత్త జిల్లాలో కలిపే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నారు. రెవెన్యూ డివిజన్ కావాలన్న కల నెరవేరిన మూడేళ్లలోనే మళ్లీ మార్పులు వద్దన్న వాదన వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాలోనే కనిగిరి ఉండాలా? కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లాలోకి మారాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్.
News November 23, 2025
ప్రకాశంలో కలవనున్న ఆ నియోజకవర్గాలు.!

ప్రకాశం ప్రజల కోరిక నెరవేరే టైం దగ్గరపడింది. అటు మార్కాపురం జిల్లా కావాలన్నది 40 ఏళ్ల కల. ఇటు విడిపోయిన అద్దంకి, కందుకూరు కలవాలన్నది మూడేళ్ల కల. 2022లో జిల్లాల విభజన సమయంలో అద్దంకి, కందుకూరు ప్రజలు తమను ప్రకాశం జిల్లాలో ఉంచాలని పట్టుబట్టారు. కానీ బాపట్ల వైపు అద్దంకి, నెల్లూరు వైపు కందుకూరు వెళ్లాయి. మార్కాపురం జిల్లా ఏర్పాటు సన్నాహాల నేపథ్యంలో మళ్లీ ఇవి ప్రకాశం వైపు రానున్నాయి.