News May 18, 2024

మార్టూరు: కాలువలోకి బైక్.. వ్యక్తి మృతి

image

బైక్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మార్టూరు మండల పరిధిలోని కొమ్మూరు మేజర్ కాలువలో శనివారం చోటుచేసుకుంది. బల్లికురవ మండలం కొణిదెన గ్రామానికి చెందిన తన్నీరు లక్ష్మయ్య (60) బ్రహ్మంగారి మఠంలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లక్ష్మయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News December 11, 2024

ప్రకాశం జిల్లా జవాన్ ఎలా చనిపోయారంటే..?

image

ప్రకాశం జిల్లా కంభం మండలం <<14839505>>రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్<<>> వరికుంట్ల సుబ్బయ్య(43) జమ్మూలో సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. 25వ రాష్ట్రీయ రైఫిల్స్‌ హవల్దార్‌గా పనిచేస్తున్న సుబ్బయ్య పూంచ్ సెక్టార్‌ వద్ద పహారా కాస్తున్నారు. ఈక్రమంలో పొరపాటున ల్యాండ్ మైన్‌పై కాలు పెట్టారు. తన ప్రాణం పోవడం ఖాయమని భావించారు. సహచర జవాన్లను ‘GO BACK’ అంటూ అలర్ట్ చేశారు. కాసేపటికే ల్యాండ్ మైన్‌ పేలడంతో వీర మరణం పొందారు.

News December 11, 2024

విజయవాడకు వెళ్లిన ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు

image

ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు ఎ. తమీమ్‌ అన్సారియా, జె. వెంకట మురళి విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.

News December 11, 2024

ఇడుపులపాయ IIITలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి అస్వస్థత

image

ఇడుపులపాయ IIIT ఓల్డ్ క్యాంపస్‌లో మంగళవారం మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్‌‌తో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్యాంపస్‌లో ఇడుపులపాయ, ఒంగోలు IIITలకు చెందిన విద్యార్థులు ఉంటున్నారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన సిబ్బంది వారికి IIIT ఆసుపత్రిలో చికిత్స అందించారు. కొందరికి 4 రోజులుగా ఆరోగ్యం బాలేదని, ప్రస్తుతం విద్యార్థులకు ప్రమాదం లేదని డైరెక్టర్ కుమారస్వామి గుప్తా అన్నారు.