News April 5, 2025
మార్పు మనతోనే ప్రారంభించాలి: ఖమ్మం కలెక్టర్

మనం ఆశించే మార్పు మన ఇంటి నుంచే ప్రారంభించాలనే సూక్తిని బాబు జగ్జీవన్ రామ్ పాటించారని, తన కుమార్తెను ఉన్నత విద్య చదివించారని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. శనివారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు.
Similar News
News April 8, 2025
క్షయ వ్యాధి నివారణపై అవగాహన కల్పించాలి: DMHO

రఘునాథపాలెం: క్షయ వ్యాధి నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డిఎంహెచ్వో డా. కళావతి బాయ్ అన్నారు. జిల్లాలో పని చేస్తున్న మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు విధి నిర్వహణ పై జిల్లా కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలలో అవగాహన పెంచాలన్నారు.
News April 8, 2025
ఖమ్మంలో ఈ నెల 9న జాబ్ మేళా…!

ఖమ్మం టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవి తెలిపారు. అపోలో ఫార్మసీలో ఖాళీగా ఉన్న 100 ఉద్యోగాల ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18-35 ఏళ్ళు కలిగి డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని అన్నారు. ఉ.10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
News April 8, 2025
బెటాలియన్కు ఎంపీ రూ.20 లక్షలు మంజూరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చాతకొండలో గల 6వ బెటాలియన్లో పలు అభివృద్ధి పనులకు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు నిధులు కేటాయింపు లేఖను సంబంధిత అధికారులకు అందజేశారు. బెటాలియన్ కమాంటెండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి, ఆర్.ఐ జీవి రామారావులు గతంలో ఎంపీ రవిచంద్రను కలిసి బెటాలియన్కు నిధులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.