News January 27, 2025
మావుళ్ళమ్మను దర్శించుకున్న సినీనటి

సంక్రాంతికి వస్తున్నాం చిత్ర హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ వారికి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం అందించారు. ఆలయ మర్యాదలతో నటి ఐశ్వర్య రాజేశ్‌ను సత్కరించారు. ఐశ్వర్య రాజేశ్‌ను చూసేందుకు, సెల్పి దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 27, 2026
రఘురామకృష్ణరాజుకు విజయవంతంగా శస్త్రచికిత్స

డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజుకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో గురువారం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. విజయవాడలో జరిగిన శాసనసభ్యుల ఆటవిడుపు క్రీడల్లో భాగంగా క్రికెట్ ఆడుతుండగా, పరుగు కోసం ప్రయత్నించి ఆయన కింద పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన మణికట్టు ఎముక విరగడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
News February 27, 2026
భీమవరం: కల్తీ రాయుళ్లకు కలెక్టర్ వార్నింగ్

జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. గత 2రోజులుగా జిల్లావ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భీమవరంలో జరిగిన తనిఖీల్లో పట్టుబడిన కల్తీ పాల పదార్థాలను మున్సిపల్ కార్యాలయం వద్ద కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చిరంచారు.
News February 26, 2026
తణుకు: కేబుల్ వైరు మెడకు తగిలి.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

సిబ్బంది నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తణుకు మండలం తేతలి వద్ద బుధవారం రాత్రి బైకుపై వెళ్తున్న వడ్లూరుకు చెందిన రాంబాబు మెడకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు చుట్టుకున్నాయి. మరమ్మతులు చేస్తున్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యలు ఆరోపించారు. మెడ భాగంలో గాయాలైన రాంబాబును చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


