News March 6, 2025
మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

కరకగూడెం మండలంలోని రేగళ్ళ, పడిగపురం, అంగోరుగూడెం, నిమ్మగూడెం, కొత్తూరు, నీలాద్రి పేట, అశ్వాపురం పాడు గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. ఈ వాల్ పోస్టర్లు ట్రైబల్ యూత్ అసోసియేషన్ పేరుతో ఉన్నాయని స్థానికులు చెప్పారు. శాంతియుత జీవనం మన హక్కు, అనుమానితుల సమాచారం ఇద్దాం, పోలీస్ శాఖకు సహకరిద్దాం, మావోయిస్టులు వద్దు అభివృద్ధి ముద్దు అంటూ అందులో పేర్కొన్నారు.
Similar News
News October 23, 2025
కర్నూలు జిల్లాలో 52,076 ఇళ్లు మంజూరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా అర్హులైన పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం 52,076 ఇళ్లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతి సచివాలయ పరిధిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 08518-257481ను సంప్రదించాలని సూచించారు.
News October 23, 2025
అభ్యంగన స్నానం వెనుక ఆంతర్యమిదే!

శరీరాద్యంతము తైలమును అంటుకోవడమే అభ్యంగనం. అనగా ఆముదము గానీ, నువ్వుల నూనె గానీ, నెయ్యి, వెన్న మొదలైన ఏదో ఒక తైలమును శరీరమంతా బాగా పట్టించి కనీసం 30 నిమిషాల తర్వాత శీకాయపొడి కానీ, పెసరపిండి కానీ, శనగపిండి గానీ ఉపయోగించి గోరువెచ్చటి నీటితో స్నానము చేయాలి. ఇది ఆధ్యాత్మిక నియమమే కాదు. ఆరోగ్యకరం కూడా! అందుకే పండుగల్లో దీన్ని విధిగా ఆచరించాలని మన పెద్దలు సూచిస్తుంటారు. కార్తీక మాసంలో ఈ నియమం ముఖ్యం.
News October 23, 2025
ఆదిలాబాద్: గంపెడు పిల్లలున్నా అవకాశం

స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అధిక సంతానం ఆంక్ష తొలగనుంది. ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లలున్నా పోటీకి అర్హత కల్పించేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన బిల్లుపై మంత్రి సీతక్క సంతకం కూడా చేశారు. 42% బీసీ రిజర్వేషన్పై హై కోర్ట్ స్టే ఇవ్వడంతో లోకల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీనిపై ఆసిఫాబాద్ జిల్లాలో చర్చ జరుగుతోంది.