News March 16, 2025
మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని వీసీలో హెచ్చరించారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీ లేకుండా చూడాలని, ఉత్తీర్ణత పెంచాలని కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. జిల్లాలో 4,141 మంది 71 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. వీటిలో 20 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.
Similar News
News December 4, 2025
HYD: జలమండలి పరిధిలో 14.36 లక్షల కనెక్షన్లు

జలమండలి పరిధిలో 14.36 లక్షల నల్లా కలెక్షన్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో 85% వరకు డొమెస్టిక్ క్యాటగిరి కనెక్షన్లు ఉండగా, మిగిలిన 15% వాణిజ్య, ఇండస్ట్రీయల్ తదితరాలు ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 10 -15 వేల వరకు కొత్త కనెక్షన్లు మహానగర వ్యాప్తంగా మంజూరు అవుతున్నాయి. వాణిజ్యం అత్యధికంగా ఉన్నప్పటికీ క్యాటగిరిలో మాత్రం తక్కువ కనిపిస్తోందని జలమండలి అనుమానం వ్యక్తం చేసింది.
News December 4, 2025
చనిపోయినట్లు నటించే బ్యాక్టీరియా!

అత్యంత అరుదైన బ్యాక్టీరియా(టెర్సికోకస్ ఫీనిసిస్)ను US సైంటిస్టులు కనుగొన్నారు. స్పేస్‌క్రాఫ్ట్ అసెంబ్లీ రూమ్స్ లాంటి భూమిపై ఉన్న అతి పరిశుభ్రమైన వాతావరణాలలోనూ ఇది జీవించగలదని తెలిపారు. ‘తన మనుగడను కొనసాగించడానికి చనిపోయినట్లు నటిస్తుంది. వీటిని గుర్తించడం, నాశనం చేయడం కష్టం. ఏదైనా బ్యాక్టీరియా వ్యాప్తి కట్టడికి కఠినమైన శుభ్రతా ప్రమాణాలు ఎందుకు పాటించాలో ఇలాంటివి నిరూపిస్తాయి’ అని పేర్కొన్నారు.
News December 4, 2025
మనసునూ పట్టించుకోవాలి: సారా అలీఖాన్

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలాముఖ్యమని బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ అంటున్నారు. భావోద్వేగాలను అణిచివేయడం బలం కాదు. వాటిని అంగీకరించే ధైర్యం కలిగి ఉండటం ముఖ్యం అంటున్నారు. ప్రస్తుత తరం మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టట్లేదు. శరీరానికి ఇచ్చే శ్రద్ధ మనసుకు కూడా ఇస్తేనే మనం బలంగా ఉన్నట్లు అర్థం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక శ్రేయస్సు గురించి కూడా చర్చించాలంటున్నారు.


