News March 16, 2025
మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని వీసీలో హెచ్చరించారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీ లేకుండా చూడాలని, ఉత్తీర్ణత పెంచాలని కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. జిల్లాలో 4,141 మంది 71 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. వీటిలో 20 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.
Similar News
News April 19, 2025
పెనుకొండలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చసుకొంది. ప్రమాదంలో కారు, బైకు ఢీకొనడంతో ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు వారు వివరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 19, 2025
కోవెలకుంట్లలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

యువకుల ప్రాణాలను హరించే క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ కే.ప్రమోద్ పేర్కొన్నారు. శనివారం కోవెలకుంట్లలో అదుపులోకి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీఐ హనుమంతు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు ఆరుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకొని రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రమోద్ వివరించారు.
News April 19, 2025
ఉండి: మహిళ మెడలో గొలుసు అపహరణ

ఉండి రాజుల పేటలో ఉంటున్న అగ్ని మాత్రం వరలక్ష్మి మెడలోని 4 కాసుల బంగారు తాడును శనివారం గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. వరలక్ష్మి గత పది సంవత్సరాలుగా ఉండిలో నివాసం ఉంటుంది. శనివారం వేకువజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి డోర్ తీసుకొని వచ్చి అటు ఇటు చూస్తుండగా వరలక్ష్మి ఎవరు అని అడగగా, తన నోరునొక్కి మెడలోని బంగారు తాడును లాక్కెళ్లాడు. పోలీసులు విచారణ చేపట్టారు.