News June 22, 2024
మా ఊర్లో మిషన్ భగీరథ నీరు వస్తలేదు: కోమటిరెడ్డి

తన సొంత గ్రామమైన బ్రాహ్మణ వెల్లంలలో మిషన్ భగీరథ నీరు రావటం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఇంటింటికీ తాగు నీరు అంటూ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చిందని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి నీరందడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 29, 2025
NLG: రెచ్చిపోతున్న కుక్కలు.. పట్టించుకోరే..!

నల్గొండ జిల్లాలో కుక్కల దాడి ఘటనలు జరిగినప్పుడే అధికారులు హడావుడి చేస్తున్నారు తప్ప తర్వాత పట్టించుకోవడం లేదని పట్టణ, పల్లె ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అటు మున్సిపల్ సిబ్బంది గానీ, ఇటు గ్రామపంచాయతీ సిబ్బంది గానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా నల్గొండ నాలుగో వార్డులో 11 మందిపై కుక్కలు దాడి చేసి బీభత్సం సృష్టించాయి.
News October 29, 2025
నల్గొండ జిల్లాలో స్కూళ్లకు సెలవులు

తుపాను ప్రభావం కారణంగా నల్గొండ జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని ఆమె సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం అందిస్తే, తక్షణ సహాయం అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 29, 2025
NLG: శిశువు విక్రయం కేసులో పురోగతి

నవ జాత శిశువు విక్రయం కేసులో నల్గొండ పోలీసులు పురోగతి సాధించారు. కడుపున పుట్టిన ఆడపిల్లను కన్నవారే విక్రయించిన ఘటనలో చిన్నారిని ఏలూరుకు చెందిన దంపతుల వద్ద పోలీసులు గుర్తించారు. శిశువు సహా ఆ దంపతులను నల్గొండకు తీసుకువచ్చి విచారిస్తున్నట్లు తెలిసింది. తిరుమలగిరి (సాగర్) మండలం ఎల్లాపురం తండాకు చెందిన కొర్ర బాబు, పార దంపతుల సంతానమైన ఆడ శిశువును రూ.3 లక్షలకు విక్రయించిన విషయం తెలిసిందే.


