News April 6, 2025
మా చిత్రాన్ని విజయవంతం చేయండి: సిద్ధు, వైష్ణవి

ఈనెల 10న తమ లేటెస్ట్ సినిమా “జాక్” థియేటర్లలో రిలీజ్ అవుతోందని, మూవీని ఆదరించాలని హీరో సిద్ధు, హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రేక్షకులను కోరారు. శనివారం ఈ సినీ నిర్మాత DVS ప్రసాద్‌తో కలసి విజయవాడలో వారు మాట్లాడుతూ..”జాక్”లో ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయన్నారు. కామెడీ, లవ్, యాక్షన్ సన్నివేశాలతో డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు.
Similar News
News December 13, 2025
ఐటీఐలో సోలార్ ఎనర్జీపై 10 రోజుల శిక్షణ

ఖమ్మం ప్రభుత్వ ఐటీఐలో డా. రెడ్డీస్, CSDసంయుక్త ఆధ్వర్యంలో 10రోజుల సోలార్ ఎనర్జీ శిక్షణ కార్యక్రమం ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. SSC, ITI(ఎలక్ట్రీషియన్), డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్‌లో ఉద్యోగావకాశం కల్పిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
News December 13, 2025
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై ఢిల్లీ సర్కార్ చట్టం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. తాజాగా దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా ఆమోదం లభించింది. ఈ చట్టం ప్రకారం అనుమతించిన ఫీజు ధరలనే స్కూల్స్ వసూలు చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25, అడ్మిషన్ ఛార్జీలు రూ.200గా నిర్ణయించారు. 3 ఏళ్లపాటు ఫీజులు స్థిరంగా ఉండేలా నిబంధనలు రూపొందించారు. ఇటువంటి చట్టం తెలుగు రాష్ట్రాల్లోనూ తీసుకొస్తే బాగుంటుంది కదా?
News December 13, 2025
అన్నమయ్య: 7th విద్యార్థికి స్క్రబ్ టైఫస్ వ్యాధి

అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థికి స్క్రబ్ టైఫస్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ SC వసతి గృహంలో ఉంటున్న అతడికి గతనెల 28న జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించడంతో అక్కడే చికిత్స అందించారు. అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్లారు. జ్వరం తగ్గకపోవడంతో ఈనెల 9న తిరుపతి రుయా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


