News April 10, 2025
మా సినిమాను ఆదరించండి: కళ్యాణ్ రామ్

అర్జున్ s/o వైజయంతి సినిమా ఈనెల 18న విడుదలవుతుందని హీరో నందమూరి కల్యాణ్ రామ్ వెల్లడించారు. తిరుపతిలోని ఓ హోటల్లో గురువారం మీడియాతో మాట్లాడారు. ‘కుమారుడి మీద ప్రేమ, భావోద్వేగాలతో సినిమా ఉంటుంది. తల్లి చెప్పిన మాట వినని కొడుకుగా కథ నడుస్తుంది. కుటుంబం మొత్తం సినిమా చూసి సంతోషంగా బయటకు వస్తారు. అందరూ మా సినిమాను ఆదరించండి’ అని కళ్యాణ్ రామ్ కోరారు.
Similar News
News November 11, 2025
జూబ్లీహిల్స్ పోలింగ్.. ప్రముఖులు ఓట్లు వేసేది ఎక్కడంటే?

TG: జూబ్లీ ఉపఎన్నికకు ఇవాళ పోలింగ్ జరగనుంది. షేక్పేట్లో డైరెక్టర్ SS రాజమౌళి, కమెడియన్ అలీ, మధురానగర్లో యాంకర్ సుమ సహా పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు ఓటు వేయనున్నారు. సినీ కార్మికుల ఓట్లు అధికంగా ఉండటంతో ఫిల్మ్ ఫెడరేషన్ షూటింగ్స్ రద్దు చేసి, వారికి సెలవు ఇచ్చింది. చిరంజీవి, చెర్రీ, బన్నీ నివాసాలు జూబ్లీ పరిధిలోనే ఉన్నా.. వారి నియోజకవర్గం మాత్రం ఖైరతాబాద్ కిందికి వస్తాయి. దీంతో వారు ఓటు వేయలేరు.
News November 11, 2025
పెదబయలు: అదృశ్యమైన విద్యార్థినీల ఆచూకీ లభ్యం

అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినీలు ఆచూకీ లభ్యమైనట్లు DSP సహబజ్ అహ్మద్, MEO పుష్ప జోసెఫ్ తెలిపారు. పెదబయలులోని గర్ల్స్-1లో చదువుతున్న వసంత, తేజ చదువుకు భయపడి పాఠశాల యాజమాన్యం కల్లుగప్పి ఈనెల 6న స్వగ్రామమైన కించురుకు బయలుదేరి వెళ్లారు. ఇంట్లో తల్లిదండ్రులు మందలిస్తారని ఊరు చివర ఉన్న కొండపై దాక్కున్నారని చెప్పారు. వారిని తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. CI శ్రీనివాసరావు, SI రమణ పాల్గొన్నారు.
News November 11, 2025
ఆరుద్రలో అడ్డెడు చల్లినా పుట్టెడు పంట

ఆరుద్ర కార్తె (జూన్ 22 నుంచి జూలై 5 వరకు ఉండే సమయం) అనేది వర్షాకాలం ప్రారంభంలో వ్యవసాయ పనులకు సరైన సమయం. ఈ కార్తెలో భూమిలో తగినంత తేమ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అడ్డెడు( తక్కువ పరిమాణంలో) విత్తనాలు చల్లినా, అవి బాగా మొలకెత్తి పుట్టెడు(ఎక్కువ) పంటను ఇస్తాయని రైతుల విశ్వాసం. ఈ సామెత ఆరుద్ర కార్తెలో విత్తనాలు వేయడం, అప్పటి వర్షాలు.. పంటకు ఎంత అనుకూలంగా ఉంటాయో తెలియజేస్తుంది.


