News February 5, 2025

మా స్థలాలకు NOCలు ఇవ్వండి: మాజీ సైనికులు

image

బాపట్ల: మాజీ సైనికులకు కేటాయించిన భూములకు సంబంధించి పదేళ్లు దాటిన వాటికి ప్రభుత్వం వెంటనే NOCలు అందించాలని మాజీ సైనిక సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు కోరారు. బాపట్లలోని మాజీ సైనికుల కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ జవానుల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని చెప్పారు. భూఆక్రమణల విషయంలో అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయన్నారు.

Similar News

News December 6, 2025

HYD: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

image

ఇండిగో విమానాల వరుస రద్దులతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరంగా ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్‌లు జత చేస్తూ ప్రయాణికుల రద్దీని తగ్గించే చర్యలు ప్రారంభించింది. దక్షిణ, తూర్పు, ఉత్తర, పశ్చిమ సహా పలురైల్వే జోన్లు మొత్తం 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు అమర్చి.. వచ్చే 10వ తేదీ వరకు ప్రయాణానికి ప్రత్యామ్నాయ సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి.

News December 6, 2025

గ్లోబల్ డిఫెన్స్ మాన్యుఫాక్చర్ హబ్‌గా ఇండియా

image

రక్షణ ఉత్పత్తుల తయారీలో గ్లోబల్ హబ్‌గా భారత్ ముందడుగు వేస్తోంది. 2029లో ₹3Tల మేర ఉత్పత్తి చేయడంతో పాటు ₹50,000 కోట్ల విలువైన ఎగుమతులు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇండియన్ ARMY, NAVY, AIRFORCEకు సంబంధించిన ₹670 Bల ప్రపోజల్‌ను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించింది. FY27లో రక్షణరంగ బడ్జెట్‌ 20% మేర పెరగవచ్చని ఇప్పటికే రక్షణ శాఖ సంకేతాలు పంపింది. దీంతో రక్షణ ఉత్పత్తులు ఊపందుకోనున్నాయి.

News December 6, 2025

VJA: హిడ్మా ఎన్‌కౌంటర్.. ఇద్దరు వ్యాపారుల పాత్రపై దర్యాప్తు

image

హిడ్మా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో విజయవాడలో ఇద్దరు వ్యాపారుల పేర్లు తెరమీదకి వచ్చాయి. వీరు మావోయిస్టుల మద్దతుదారులా? లేక పోలీసుల ఇన్‌ఫార్మర్లా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పెనమలూరులో పట్టుబడిన మావోయిస్టులతో వీరికి సంబంధాలున్నాయా అనే కోణంలో ఇంటెలిజెన్స్ శాఖ దర్యాప్తును వేగవంతం చేసింది.