News June 30, 2024

మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండో విడత కౌన్సెలింగ్

image

గుంటూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ చిన్న వెంకటేశ్వరరావు తెలిపారు. జులై 24లోపు వెబ్ సైట్లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. అలాగే అదే రోజు తెనాలి, గుంటూరులలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లోని నమోదు కేంద్రాల్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు.

Similar News

News November 27, 2025

పోలీసు కుటుంబాలకు అండగా గుంటూరు ఎస్పీ

image

గుంటూరు AR హెడ్ కానిస్టేబుల్ షేఖ్ మొహిద్దిన్ బాషా కుమారుడు షేఖ్ ఆఖ్యార్ అహ్మద్ సాఫ్ట్ టెన్నిస్‌లో దేశస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. శ్రీకాకుళంలో అండర్-17 టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించిన అతనికి ఎస్పీ వకుల్ జిందాల్ ప్రోత్సాహకంగా రూ. 20 వేల విలువైన టెన్నిస్ బ్యాట్‌ అందజేశారు. పోలీసు కుటుంబం నుంచి జాతీయ స్థాయికి చేరడం గర్వకారణమని ఎస్పీ పేర్కొంటూ, భవిష్యత్ విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు.

News November 27, 2025

దుగ్గిరాల యార్డులో క్వింటాల్ పసుపు ఎంతంటే.!

image

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు ధరలు నిలకడగా ఉన్నాయి. క్వింటాల్ పసుపు గరిష్ఠంగా రూ. 12,700 ధర పలికింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పసుపు కొమ్ముల ధర రూ. 9 వేల నుంచి రూ. 12,700 వరకు, కాయ రకం పసుపు ధర రూ. 9,300 నుంచి రూ. 12,190 వరకు పలికాయి. మార్కెట్‌లో మొత్తం మీద పసుపు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

News November 27, 2025

అమరావతి రైతులు ఆందోళన వద్దు: పెమ్మసాని

image

రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. త్రీ మ్యాన్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. అమరావతి సమస్యలకు పరిష్కారం చూపుతూనే, రాజధాని పనులు వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. రాబోయే 6 నెలల్లో రాజధానికి అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తిచేసే దిశగా పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు. మరో 4 రోజుల్లో జరగబోయే 2వ సమావేశంలో రైతులకు పూర్తి వివరాలు చెప్తామన్నారు.