News April 7, 2024
మిడ్జిల్: భర్త గొంతు కోసిన భార్య

తాగి గొడవ పడుతూ.. డబ్బుల కోసం వేధిస్తున్నాడని భార్య భర్త గొంతు కోసిన ఘటన మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామంలో చోటుచేసుకుంది. SI వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హుస్సేన్ శుక్రవారం రాత్రి భార్య అలివేలును డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. విసుగు చెందిన భార్య ఈల పీటతో గొంతు కోసింది. కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హుస్సేన్ తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News November 27, 2025
MBNR: ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయిని దేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆమె వివరించారు. అనంతరం ఎస్పీ జానకి అల్లిపూర్ గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
News November 27, 2025
బాలానగర్‌లో 13.5°C.. పెరిగిన చలి తీవ్రత

మహబూబ్‌నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో జిల్లాలోనే అత్యల్పంగా బాలానగర్‌లో 13.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్లో 13.8°C, దోనూరులో 13.9°C నమోదయ్యింది. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.
News November 27, 2025
MBNR: నేటి నుంచి నామినేషన్లు.. ఇవి తప్పనిసరి.!

✒సంబంధిత ప్రాంతం ఓటర్ లిస్టులో పేరు ఉండాలి
✒21 ఏళ్ల వయస్సు ఉండాలి
✒నిర్ణీత డిపాజిట్ సొమ్ము చెల్లించాలి
✒నేర చరిత్ర, ఆస్తులు,అఫిడవిట్ పై అభ్యర్థి ఎలక్షన్ ఖర్చు,విద్యార్హతల అఫిడవిట్ ఇవ్వాలి
✒SC,ST,BC వారు కుల సర్టిఫికేట్ జతచేయాలి
✒అఫిడవిట్ పై అభ్యర్థి+2 సంతకాలు ఉండాలి
✒ఎలక్షన్ ఖర్చు నిర్వహిస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి


