News September 8, 2024
మిడ్ మానేరుతో నిర్వాసితులకు ఉపాధి!
మధ్యమానేరు నిర్వాసితులు మిడ్ మానేరులో చేపలు పడుతూ ఆర్థికంగా స్థిరపడ్డారు. మధ్యమానేరు నిర్మాణంతో సర్వం కోల్పోయి పునరావాస గ్రామాలకు తరలిన మత్స్యకారులు అదే ప్రాజెక్టును ఉపాధికి నిలయంగా మార్చుకున్నారు. హైదరాబాద్ వంటి పట్టణాలకు చేపలు తరలిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. దాదాపు 1500 మంది చేపలు పట్టేందుకు లైసెన్స్ పొందారు.
Similar News
News October 10, 2024
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రావాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలోనే జిల్లాలో పర్యటిస్తానని తెలిపారు.
News October 10, 2024
సిరిసిల్ల: సీఎం రేవంత్ రెడ్డి బొమ్మతో బతుకమ్మ
సీఎం రేవంత్ రెడ్డిపై అభిమానంతో ఓ యువకుడు వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి సద్దు బతుకమ్మ సందర్భంగా బతుకమ్మపై రేవంత్ రెడ్డి చిత్రపటం వచ్చేలా బతుకమ్మను పేర్చి సోషల్ మీడియాలో చిత్రాలు అప్లోడ్ చేశారు. నెటిజన్లను ఈ బతుకమ్మ ఎంతగానో ఆకర్షిస్తోంది.
News October 10, 2024
గోదావరిఖని టూ టౌన్ పరిధిలో యువకుడి హత్య
గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి యైటింక్లైన్ కాలనీ- హనుమాన్ నగర్‌లో వినయ్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. యువకుల మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో పట్టపగలే కత్తులతో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.