News July 21, 2024

మిథున్ రెడ్డి భద్రత కుదింపు..?

image

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భద్రత మరింత కుదించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకు ఆయనకు 4 + 4 భద్రత కొనసాగింది. ఆ తర్వాత 2+2 గన్‌మెన్లకు ప్రభుత్వం తగ్గించింది. ఇదే విషయమై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఉంది. పుంగనూరు అల్లర్ల తర్వాత ఆయన భద్రతను 1+1కు కుదించారని.. దాడుల తర్వాత సెక్యూరిటీ పెంచాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం దారుణమని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.

Similar News

News October 16, 2025

17న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం

image

చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై ఈ సమావేశంలో సమీక్షిస్తామని చెప్పారు. సభ్యులందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు.

News October 16, 2025

కల్యాణ రేవు జలపాతంలో యువకుడి గల్లంతు

image

పలమనేరు రూరల్ మండలంలో కళ్యాణ రేవు జలపాతంలో గురువారం సాయంత్రం ఓ యువకుడు గల్లంతయ్యాడు. పట్టణానికి చెందిన యూనిస్ (23) స్నేహితులతో కలిసి జలపాతం చూడటానికి వచ్చి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్నేహితులు సమాచారం అందించారు. కాగా దట్టమైన అడవిలో నెలకొన్న ఈ జలపాతం వద్దకు వెళ్లేందుకు వర్షం అడ్డంకిగా మారింది. పూర్తి సమాచారం పోలీసులు వెళ్లాడించాల్సి ఉంది.

News October 16, 2025

తోతాపురం సబ్సిడి పడలేదా.. ఇలా చేయండి.!

image

తోతాపూరి మామిడి రైతులకు అందించిన సబ్సిడీపై సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. తమ సందేహాలను 08572-242777 నంబర్ ద్వారా తెలుసుకోవచ్చాన్నారు. అర్హత ఉన్నా నగదు జమకాని రైతులు రైతు సేవా కేంద్రాలు, హార్టికల్చర్ కార్యాలయాలలో ఈనెల 30లోపు వినతి పత్రాలు అందజేయాలన్నారు. రెండు రోజుల్లో వాటిని పరిష్కరిస్తామన్నారు.