News August 2, 2024
మిద్దె కూలి నలుగురి మృతి.. నంద్యాల జిల్లాలో విషాదం

నంద్యాల జిల్లాలో ఘోర విషాదం జరిగింది. మట్టి మిద్దె కూలి ఓ కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. చాగలమర్రి మండల పరిధిలోని చిన్న వంగలి గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురు శేఖర్ రెడ్డి, ఆయన భార్య ఇద్దరు తమ పిల్లలతో కలిసి నిద్రించగా వారి జీవితాలు నిద్రలోనే తెల్లారాయి. అర్ధరాత్రి వేళ హఠాత్తుగా మట్టి మిద్దె కూలి వారిపై పడటంతో నలుగురూ చనిపోయారు. ఈ ఘటనతో చిన్న వంగలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 7, 2025
10వ తేదీ నుంచి జిల్లా టెట్ పరీక్షలు: డీఈవో

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లును చేసిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి 21 వరకు జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో 3, ఆదోని,ఎమ్మిగనూరులో 1 చొప్పున పరీక్షా ఏర్పాటు చేశారు. వీటితోపాటు హైదరాబాద్లో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 39,485 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు.
News December 7, 2025
ప్రశాంతంగా ఎన్ఎంఎమ్ఎస్ పరీక్షలు: డీఈఓ

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. కర్నూలులోని బి.క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును డీఈవో శామ్యూల్ పాల్ పరిశీలించారు. 4,124 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 3,960 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 164 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు.
News December 7, 2025
నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలి: ఎస్పీ

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు చేపట్టారు.


