News February 13, 2025
మినీ మేడారం జాతరకు ప్రత్యేక బస్సు

మేడారంలో జరిగే సమ్మక్క- సారలమ్మ మినీ మేడారం జాతరకు కొత్తగూడెం నుంచి బస్సు నడుపుతున్నట్లు ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ఈ బస్సు కొత్తగూడెంలో ఉదయం 8 గంటలకు బయలుదేరి 12 గంటలకు మేడారం చేరుకుంటుందని, సాయంత్రం 4:30 గంటలకు మేడారంలో బయల్దేరి రాత్రి 8:30 గంటలకు కొత్తగూడెం చేరుకుంటుందని తెలిపారు. ఈ సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News October 31, 2025
ఆ మందు లేదన్నందుకు వైన్‌షాప్ క్యాషియర్‌పై దాడి

ఖమ్మం: ఆ మద్యం బ్రాండ్(రాయల్ స్ట్రాంగ్) ఇవ్వలేదన్న కోపంతో వైన్ షాప్ క్యాషియర్‌పై యువకులు దాడి పాల్పడిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. పిండిప్రోలులోని ఓ వైన్ షాప్‌లో పనిచేసే పోలెపొంగు కృష్ణ అనే క్యాషియర్‌పై ఐదుగురు యువకులు తనకు నచ్చిన మధ్యం ఇవ్వాలని అడిగారు. అది లేదనడంతో కోపంతో డాడికి పాల్పడ్డారు. దాడి వీడియోలు సీసీ కెమెరాలు రికార్డు కాగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News October 31, 2025
పంట పొలాల్లో వర్షపు నీటిని బయటకు పంపాలి: కలెక్టర్

పంటపొలాల్లో వర్షపు నీటిని బయటకు పంపాలని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు, నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పంట దెబ్బతినకుండా కాపాడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేసి ఉన్నారని గుర్తు చేశారు. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
News October 31, 2025
రవితేజ ‘మాస్ జాతర’ రివ్యూ&రేటింగ్

గంజాయి ముఠాను సిన్సియర్ రైల్వే పోలీసు ఎలా అంతం చేశాడనేదే ‘మాస్ జాతర’ స్టోరీ. రవితేజ లుక్, ఎనర్జీ, ఫైట్స్, డైలాగ్స్‌తో అదరగొట్టారు. అక్కడక్కడ కామెడీ సీన్లు నవ్వు తెప్పిస్తాయి. BGM, సాంగ్స్ ఆకట్టుకుంటాయి. రొటీన్ కమర్షియల్ స్టోరీ, కథలో బలం లేకపోవడం, ఔట్‌డేటెడ్ స్క్రీన్ ప్లే నిరాశ పరుస్తాయి. మధ్యమధ్యలో కొన్ని అనవసర సీన్లు చికాకు తెప్పిస్తాయి.
RATING: 2.5/5


