News February 9, 2025
మినీ మేడారం జాతర మరో మూడు రోజులే!

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ జాతరకు 20 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు జంపన్న వాగు వద్ద స్నానాలు ఆచరించడానికి షవర్లు, తాగునీటి సదుపాయం, పార్కింగ్ స్థలాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. బుధవారం నుంచి శనివారం వరకు మినీ జాతర జరగనుంది.
Similar News
News November 9, 2025
శంషాబాద్: మూడు విమానాలు రద్దు

వివిధ గమ్యస్థానాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం రాకపోకలు సాగించే మరో 3 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి HYD రావాల్సిన విమానం, జైపూర్ నుంచి HYD రావల్సిన 2 విమానాలు రద్దయ్యాయి. అలాగే సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి.
News November 9, 2025
నాగర్కర్నూల్: బస్సు ఆపలేదని శ్రీశైలం రహదారిపై మహిళల ధర్నా

నాగర్కర్నూల్ జిల్లా మన్ననూర్ చౌరస్తాలో శ్రీశైలం జాతీయ రహదారిపై మహిళలు ధర్నా చేపట్టారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం వెళ్లేందుకు గంటల తరబడి ఎదురుచూసినా ఒక్క బస్సు ఆపకపోవడంతో ఆగ్రహంతో బస్సును అడ్డగించారు. ఈ సంఘటనతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారి జోక్యంతో సమస్య సద్దుమణిగింది, అనంతరం మహిళలు తమ ప్రయాణం కొనసాగించారు.
News November 9, 2025
‘ఎలుకల దాడి’పై మంత్రి సత్యకుమార్ సీరియస్

AP: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుకలు కరవడంపై మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని DME రఘునందన్ను ఆదేశించారు. హాస్టల్ వార్డెన్ వివరణ కోరుతూ మెమో ఇవ్వాలని కాలేజీ ప్రిన్సిపల్ను ఆదేశించారు. కాగా హాస్టల్లోని పరిస్థితులపై తనిఖీ చేస్తున్నామని డీఎంఈ మంత్రికి తెలియజేశారు.


