News February 9, 2025
మినీ మేడారం జాతర మరో మూడు రోజులే!

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ జాతరకు 20 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు జంపన్న వాగు వద్ద స్నానాలు ఆచరించడానికి షవర్లు, తాగునీటి సదుపాయం, పార్కింగ్ స్థలాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. బుధవారం నుంచి శనివారం వరకు మినీ జాతర జరగనుంది.
Similar News
News March 16, 2025
రఘునాథపల్లి: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంద జకరయ్య (శేఖర్) అనే వ్యక్తికి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 16, 2025
పింఛన్‌దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

AP: రాష్ట్రంలో కొందరు వృద్ధులకు వేలిముద్రలు అరిగిపోయి పెన్షన్ల పంపిణీ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు 1,34,450 అత్యాధునిక స్కానర్లను పంపిణీ చేయనుంది. ఇందులో ఉడాయ్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేశారు. ఈ పరికరాల సాయంతో వేలిముద్రల సమస్యకు చెక్ పెట్టొచ్చని సర్కార్ భావిస్తోంది.
News March 16, 2025
నరసరావుపేట: రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య

నరసరావుపేట టిడ్కో గృహాల సమీపంలోని రైలు పట్టాల వద్ద డోన్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు నాయక్ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మృతురాలు నీలం రంగు డిజైన్ చీర, నీలం రంగు జాకెట్టు ధరించినట్లు చెప్పారు. మృతురాలిని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు స్థానిక రైల్వే పోలీసులను 9440438256 సంప్రదించాలన్నారు.