News April 6, 2024
మిరుదొడ్డి: సైబర్ బాధితుడికి నగదు అందజేత

నగదు పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి కొంత మొత్తం అందజేసినట్లు ఎస్సై పరశురాములు తెలిపారు. మిరుదొడ్డి మండలంకు చెందిన అందే స్వామి 2023లో సైబర్ నేరస్థుల బారిన పడి తన ఖాతాలో ఉన్న రూ.75 వేలను పోగొట్టుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో మిరుదొడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరస్తుడి ఖాతాను హోల్డ్ చేసి ఖాతాలో ఉన్న రూ.23,200 నగదును న్యాయస్థానం ఆదేశాల మేరకు బాధితుడికి చెక్కు అందజేశారు.
Similar News
News October 15, 2025
రామాయంపేట: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పురుగుల మందు తాగి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేటలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గొలిపర్తి గ్రామానికి చెందిన ఎర్రం బాలకృష్ణ(40) కేసీఆర్ కాలనీలో నివాసం ఉంటారు. మంగళవారం రాత్రి గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
News October 14, 2025
మెదక్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావును ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే రక్తదాన శిబిరంపై చర్చించారు. పోలీస్ హెడ్ క్వార్టర్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
News October 14, 2025
రామాయంపేట: ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి’

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. రామాయంపేట మండలం కోనాపూర్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం నిర్మాణం చేపడితే సకాలంలో బిల్లులు చెల్లిస్తామని పేర్కొన్నారు.