News November 4, 2024

మిర్యాలగూడలో బయటపడిన పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం

image

మిర్యాలగూడ సీతారాంపురం కాలనీ రామాలయం వీధిలో ఓ వ్యక్తి గొయ్యి తవ్వుతుండగా ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. విగ్రహానికి కాలనీవాసులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. అక్కడ గుడి నిర్మించాలని కాలనీవాసులు భావిస్తున్నారు. విగ్రహాన్ని చూడడానికి స్థానికులు బారులు తీరారు. 

Similar News

News December 5, 2024

చిట్యాల: మహిళను కొట్టి పుస్తెలతాడు అపహరణ

image

ఇంట్లోకి ఇద్దరు చొరబడి ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును లాక్కెళ్ళిన ఘటన బుధవారం చిట్యాలలో చోటుచేసుకుంది. ఎస్సై ధర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని ఇద్దరు ఉరుమడ్ల రోడ్డులో గల చేపూరి ప్రేమలత ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెను కొట్టి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పూసలతాడును లాక్కెళ్లారు. అనంతరం వారు వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై పారిపోయారు.

News December 5, 2024

కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి: కలెక్టర్

image

గ్రామస్థాయి స్థానిక సంస్థలలో 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి, నియమ నిబంధనల ప్రకారం 2025- 26 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె జడ్పీ సమావేశ మందిరంలో 2025-2026 సంవత్సరానికి సంబంధించి 15 వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి రూపొందించే కార్యచరణ ప్రణాళిక పై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

News December 4, 2024

నడిగూడెం: బంతి తోట.. లాభాల పంట

image

బంతి తోట సాగుతో మంచి లాభాలు వచ్చాయని బంతితోట సాగు రైతు మేకపోతుల వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన రైతు నడిగూడెం నుంచి రామచంద్రపురం వెళ్లే ప్రధాన రహదారి పక్కన తనకున్న వ్యవసాయ భూమిలో కొంత 0.50 సెంట్లలో బంతితోట సాగు చేశారు.కింటాకు రూ.5,000 – 6000 ధర పలుకుతుందని తెలిపారు. బంతి తోట సాగు చేయాలని నిర్ణయించుకొని వరికి బదులుగా బంతితోట సాగు చేయటంతో లాభసాటిగా ఉందన్నారు.