News April 3, 2024

మిర్యాలగూడలో బీజేపీకి రాజీనామా 

image

బీజేపీ మిర్యాలగూడ అసెంబ్లీ కన్వీనర్ పదవికి బానోతు రతన్ సింగ్ బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించినట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి ప్రభారీ పని తీరు వల్ల నష్టపోయామని, పార్లమెంట్ ఎన్నికలలో నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 2, 2025

నల్గొండ: టైలరింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తు పొడిగింపు

image

నల్గొండ శివారు రాంనగర్ లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ స్త్రీలకు టైలరింగ్ లో 31 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుండి 45 లోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు నవంబర్ 3 వరకు ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News November 2, 2025

పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

జిల్లాలోని ప్రైవేట్ పారామెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఎంహెచ్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. డీఎంపీహెచ్ఎ(మేల్), డీఎంఎల్, డీఓఏ, డీఏఎన్ఎస్, డీఎంఐటీ, డీఆర్జీఏ, డీఓఎం, డీఈసీజీ, డయాలసిస్, డిఎంఎస్టీతో పాటు ఇతర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 27లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 2, 2025

NLG: నజరానా ఇస్తాం.. షాపు ఇస్తారా?!

image

నల్గొండ జిల్లాలో నూతన మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి కావడంతో కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్న వారికి వ్యాపారులు బంపర్ ఆఫర్ చేస్తున్నారు. నజరానా ఇస్తాం.. షాపు ఇస్తారా.. అంటూ ప్రలోభపెడుతున్నారు. ఈసారి టెండర్లలో పాత మద్యం వ్యాపారులకు దురదృష్టం, కొత్త వారికి అదృష్టం కలిసి వచ్చింది. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు 4906 దరఖాస్తులు వచ్చిన విషయం విధితమే.